తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  India Victory Parade: ప్రపంచకప్ టైటిల్‍తో టీమిండియా విక్టరీ పరేడ్.. జనసంద్రమైన ముంబై: ఫొటోలు

India Victory Parade: ప్రపంచకప్ టైటిల్‍తో టీమిండియా విక్టరీ పరేడ్.. జనసంద్రమైన ముంబై: ఫొటోలు

Jul 04, 2024, 11:47 PM IST Chatakonda Krishna Prakash
Jul 04, 2024, 11:47 PM , IST

  • India Victory Parade Photos: టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ సాధించిన టీమిండియా నేడు (జూలై 4) ముంబైలో విక్టరీ పరేడ్ చేసింది. ముంబైలో జరిగిన ఈ పరేడ్‍కు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో హాజరై.. భారత జట్టుకు జేజేలు పలికారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.

భారత జట్టు విక్టరీ పరేడ్ నేడు ముంబైలో అత్యంత భారీగా జరిగింది. ముంబైలోని నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఈ విజయోత్సవ యాత్ర సాగింది. వేలాది మంది అభిమానులు ఈ పరేడ్‍కు హాజరయ్యారు. నినాదాలతో హోరెత్తించారు. ముంబై సాగర తీరం జనసంద్రంతో నిండిపోయింది.

(1 / 6)

టీ20 ప్రపంచకప్ టైటిల్‍తో ఓపెన్ టాప్ బస్‍పై సెలెబ్రేట్ చేసుకున్నారు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాం���్యా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ సహా మిగిలిన భారత ఆటగాళ్లు. విక్టరీ పరేడ్ పొడవునా వరల్డ్ కప్ ట్రోఫీని ప్రజలకు చూపిస్తూ అభివాదం చేశారు. 

(2 / 6)

టీ20 ప్రపంచకప్ టైటిల్‍తో ఓపెన్ టాప్ బస్‍పై సెలెబ్రేట్ చేసుకున్నారు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ సహా మిగిలిన భారత ఆటగాళ్లు. విక్టరీ పరేడ్ పొడవునా వరల్డ్ కప్ ట్రోఫీని ప్రజలకు చూపిస్తూ అభివాదం చేశారు. 

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కలిసి టీ20 ప్రపంచకప్ టైటిల్ ఎత్తారు. తమ అభిమానులకు ట్రోఫీ చూపించారు. పరేడ్ తర్వాత వాంఖడే స్టేడియంలో జరిగిన సెలెబ్రేషన్లలో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. 

(3 / 6)

టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా భారత అభిమానులకు టైటిల్ చూపిస్తూ సంబరపడ్డాడు. ఇతర ఆటగాళ్లు కూడా సెలెబ్రేట్ చేసుకున్నారు. 

(4 / 6)

విక్టరీ పరేడ్‍కు వేల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఇండియా.. ఇండియా అనే నామస్మరణతో మోతెక్కించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంటూ హోరెత్తించారు. 

(5 / 6)

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 ప్రపంచకప్ టైటిల్ చేతపట్టుకొని సంతోషంగా కనిపించాడు. అభిమానులతో విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నాడు. గత శనివారం (జూన్ 29) బార్బడోస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‍‍లో దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది భారత్.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు