తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Triptii Dimri Jaanam Song: విక్కీ కౌశల్‍తో యానిమల్ బ్యూటీ తృప్తి హాట్ రొమాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్.. రియాక్షన్లు ఇవే

Triptii Dimri Jaanam Song: విక్కీ కౌశల్‍తో యానిమల్ బ్యూటీ తృప్తి హాట్ రొమాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్.. రియాక్షన్లు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 09, 2024 07:46 PM IST

Triptii Dimri Jaanam Song: బ్యాడ్ న్యూజ్ సినిమా నుంచి కొత్త సాంగ్ వచ్చింది. జానమ్ అంటూ వచ్చిన పాటలో విక్కీ కౌశల్, తృప్తి డిమ్రి రొమాన్స్‌తో హీటెక్కించారు.

Triptii Dimri Jaanam Song: విక్కీ కౌశల్‍తో యానిమల్ బ్యూటీ తృప్తి హాట్ రొమాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్.. రియాక్షన్లు ఇవే
Triptii Dimri Jaanam Song: విక్కీ కౌశల్‍తో యానిమల్ బ్యూటీ తృప్తి హాట్ రొమాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్.. రియాక్షన్లు ఇవే

యానిమల్ సినిమాతో తృప్తి డిమ్రి ఒక్కసారిగా చాలా పాపులర్ అయ్యారు. గతేడాది డిసె���బర్లో వచ్చిన ఆ చిత్రంలో హీరో రణ్‍బీర్ కపూర్‌తో ఇంటిమేట్ సీన్‍లో ఆమె నటించారు. ఒక్కసారిగా కొత్త నేషనల్ క్రష్ అయ్యారు తృప్తి. ప్రస్తుతం విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న బ్యాడ్ న్యూజ్ చిత్రంలో తృప్తి డిమ్రి హీరోయిన్‍గా చేస్తున్నారు. జానమ్ అంటూ ఉన్న వీడియో సాంగ్ నేడు (జూలై 9) ఆ చిత్రం రిలీజ్ అయింది. ఈ పాటలో విక్కీ, తృప్తి రొమాన్స్‌తో రెచ్చిపోయారు.

హాట్ సీన్లతో..

బ్యాడ్ న్యూజ్‍ చిత్రంలోని ఈ జానమ్ పాట మొత్తం విక్కీ కౌశల్, తృప్తి డిమ్రి హాట్ సీన్లతో నిండిపోయింది. లిప్ కిస్‍లు, బెడ్ సీన్, స్విమ్మింగ్ పూల్‍, షవర్ కింద రొమాన్స్ ఇలా పాట అంతా ఇంటిమేట్ సీన్లే ఉన్నాయి. విక్కీ, తృప్తి మధ్య కెమెస్ట్రీ కూడా బాగానే కుదిరింది.

జానమ్ పాటకు మెలోడియస్ ట్యూన్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ మిశ్రా. ఆయనే పాట పాడారు, లిరిక్స్ కూడా రాసుకున్నారు. పాట వినసొంపుగానే ఉంది. ఈ పాటకు రెమో డిసౌజా కొరియోగ్రఫీ చేశారు.

నెటిజన్ల స్పందన ఇదే

జానమ్ పాటకు అధిక శాతం మంది నుంచి నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇది క్రింజ్‍లా ఉందని, ఎఫెక్టివ్‍గా లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మంచి నటులైన విక్కీ కౌశల్, తృప్తి డిమ్రితో ఇలాంటి చెత్త ఎందుకు అంటూ ఓ యూజర్ పోస్ట్ చేశారు.

యానిమల్ చిత్రంలో తృప్తి చాలా క్లాసీగా కనిపించారని, కానీ ఈ జానమ్ సాంగ్‍లో స్టైల్ కూడా సరిగా లేదని మరొకరు అభిప్రాయపడ్డారు. కావాలనే రొమాన్స్ సీన్లతో పాటను మేకర్స్ నింపేశారని, అయితే ఎఫెక్టివ్‍గా లేదని మరో యూజర్ కామెంట్ చేశారు. ఇది అడ్వర్టైజ్‍మెంట్‍లా ఉందని, సినిమాలో సాంగ్‍లా లేదని మరికొందరు అంటున్నారు. తృప్తి డిమ్రికి మంచి యాక్టింగ్ టాలెంట్ ఉందని, కానీ ఆమెను ఇలాంటి సీన్లకే పరిమితం చేస్తారేమోనని ఆందోళనగా ఉందని మరో యూజర్ రాసుకొచ్చారు.

మొత్తంగా జానమ్ సాంగ్‍కు ఎక్కువ శాతం నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. సెక్సీయెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ ఈ పాటను బ్యాడ్‍న్యూజ్ మూవీ టీమ్ ప్రచారం చేస్తోంది. అయితే, ఆశించిన విధంగా స్పందన రావడం లేదు.

కత్రినా ఎక్కడంటూ..

మరికొందరు నెటిజన్లు విక్కీ కౌశల్ భార్య కత్రినా కైఫ్‍ను ప్రస్తావిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కత్రినా ఎక్కడ ఉన్నారు? ఓ యూజర్ పోస్ట్ చేశారు. కత్రినా కైఫ్ అక్కడే ఉండి బాధగా చూస్తుంటారని మరో యూజర్ సరదాగా రాసుకొచ్చారు.

బ్యాడ్‍న్యూజ్ చిత్రానికి ఆనంద్ తివారీ దర్శకత్వం వహించారు. 2019లో అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన గుడ్‍న్యూజ్ మూవీకి సీక్వెల్‍గా దీన్ని తెరకెక్కించారు. ఈ బ్యాడ్‍న్యూజ్ సినిమా జూలై 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా.. అమెజాన్ ప్రైమ్ సమర్పిస్తోంది.

WhatsApp channel