తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Maidaan Ott : తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన హైదరాబాదీ లెజెండరీ కోచ్ బయోపిక్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

Maidaan OTT : తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన హైదరాబాదీ లెజెండరీ కోచ్ బయోపిక్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 09, 2024 04:16 PM IST

Maidaan OTT Streaming: మైదాన్ సినిమా ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ముందుగా హిందీలో వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్‍లో అడుగుపెట్టింది. అజయ్ దేవ్‍గణ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చంటే..

OTT Movie: తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన హైదరాబాదీ లెజెండరీ కోచ్ బయోపిక్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
OTT Movie: తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన హైదరాబాదీ లెజెండరీ కోచ్ బయోపిక్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‍గణ్ ప్రధాన పాత్ర పోషించిన మైదాన్ సినిమా ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మొదటి నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే, అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు. హైదరాబాద్‍కు చెందిన లెజండరీ ఫుట్‍బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా మైదాన్ చిత్రం రూపొందింది. ఈ బయోగ్రఫీ చిత్రానికి అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్లలో హిందీలో మాత్రమే రిలీజైంది. ఓటీటీలో కూడా ముందుగా అదే భాషలో వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చాయి.

తెలుగుతో పాటు మరో రెండు భాషల్లోనూ..

మైదాన్ సినిమా ముందుగా రెంటల్ పద్ధతిలో మేలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చింది. ఆ తర్వాత జూన్ 5న రెంట్ లేకుండా ప్రైమ్ వీడియో సబ్‍స్కైబర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే, మైదాన్ చిత్రం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ మాస్టర్ పీస్ మూవీని ఇతర భాషల డబ్బింగ్‍లోనూ తీసుకురావాలనే డిమాండ్లను కొందరు నెటిజన్లు చేశారు. ఇప్పుడు, మైదాన్ చిత్రాన్ని మరో మూడు భాషల్లో ప్రైమ్ వీడియో తీసుకొచ్చింది.

మైదాన్ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల వెర్షన్‍లను అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులోకి తెచ్చింది. హిందీతో పాటు ఈ మూడు భాషల ఆడియోలను నేడు మైదాన్ మూవీకి యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

మైదాన్ చిత్రాన్ని డైరెక్టర్ అమిత్ శర్మ తెరకెక్కించారు. ఆయనపై ప్రశంసలు కూడా వచ్చాయి. ఫుట్‍బాల్ కోచ్‍ సయ్యద్ అబ్దుల్ రహీం పాత్రలో అజయ్ దేవ్‍గణ్ నటన కూడా మెప్పించింది. ప్రియమణి, గిరిరాజ్ రావ్, దివ్యాన్ష్ త్రిపాఠి, రిషబ్ జోషి, నితాన్షి గోయెల్, ఆయేషా వింధార, మీనల్ పటేల్, రుద్రనీల్ ఘోష్ మూవీలో కీలకపాత్రలు పోషించారు.

ఫుట్‍బాల్‍కు స్వర్ణయుగం

భారత ఫుట్‍బాల్ టీమ్‍కు 1950 నుంచి 1963 మధ్య ప్రధాన కోచ్‍గా కోచ్‍గా, మేనేజర్‍గా బాధ్యతలు నిర్వర్తించారు హైదరాబాద్‍కు చెందిన సయ్యద్ అబ్దుల్ రహీమ్. భారత ఫుట్‌బాల్ చరిత్రలో ఆ కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తారు. అప్పట్లో ఈ టీమ్‍కు బ్రెజిల్ ఆఫ్ ఆసియా అనే బిరుదు కూడా వచ్చింది. అంతలా ఆయన మార్గదర్శకత్వంలో భారత జట్టు అద్భుతమైన విజయాలను సాధించింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఆయన టీమిండియాను ముందుకు నడిపారు. రహీమ్ మార్శకత్వంలో 1951, 1962 ఆసియా గేమ్స్‌లో భారత ఫుట్‍బాల్ టీమ్ స్వర్ణపతకాలు సాధించింది. 1956 మెల్‍బోర్న్ ఒలింపిక్ క్రీడల్లో సెమీస్ వరకు చేరింది. 1963లో మరణించే వరకు ఆయన కోచ్‍గానే ఉన్నారు. ఇంత స్ఫూర్తిదాయకమైన లెజండరీ కోచ్ రహీమ్ జీవితం ఆధారంగా మైదాన్ మూవీ రూపొందింది.

పాజిటివ్ టాక్ వచ్చినా..

మైదాన్ చిత్రానికి ముందు నుంచి పాజిటివ్ రివ్యూలు, మంచి టాక్ వచ్చాయి. అయితే, కమర్షియల్‍గా మాత్రం ఈ చిత్రం సక్సెస్ కాలేకపోయింది. సుమారు రూ.235 కోట్ల బడ్జెట్‍తో రూపొందించిన ఈ మూవీకి దాదాపు రూ.89కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రాన్ని జీస్టూడియోస్, బేవ్యూ ప్రాజెక్ట్స్, ఫ్రెష్ లైమ్ ఫిల్మ్స్ బ్యానర్లు నిర్మించాయి.

WhatsApp channel