తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market: బోనస్ షేర్ల ఎఫెక్ట్: లక్ష రూపాయలు మూడేళ్లలో 11 లక్షల రూపాయలయ్యాయి..

Stock market: బోనస్ షేర్ల ఎఫెక్ట్: లక్ష రూపాయలు మూడేళ్లలో 11 లక్షల రూపాయలయ్యాయి..

HT Telugu Desk HT Telugu
Jul 09, 2024 06:48 PM IST

స్టాక్ మార్కెట్లో మల్టీ బ్యాగర్ స్టాక్ లను గుర్తించడం ఒక కళ. దేశీయ, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక, సాంకేతిక వ్యవహారాలతో పాటు, స్టాక్ మార్కెట్ ను నిరంతరం అధ్యయనం చేస్తుంటేనే మల్టీ బ్యాగర్లను ముందుగానే గుర్తించడం సాధ్యమవుతుంది. మూడేళ్లలో ఇన్వెస్టర్లకు 11 రెట్ల లాభాలు ఇచ్చిన ఈ మల్టీ బ్యాగర్ తెలుసా?

లక్ష రూపాయలు మూడేళ్లలో 11 లక్షలు
లక్ష రూపాయలు మూడేళ్లలో 11 లక్షలు (Photo: Pixabay)

స్టాక్ మార్కెట్లో (Stock market) తాత్కాలిక ప్రయోజనాల కన్నా దీర్ఘకాలంలో వచ్చే ప్రయోజనాలపై దృష్టి పెట్టినవాడే సరైన ఇన్వెస్టర్ అని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. సాధారణంగా ఇ���్వెస్టర్లు స్టాక్ ధర పెరుగుదలతో పాటు డివిడెండ్లు, బోనస్ షేర్లు, షేర్ల బైబ్యాక్, రైట్స్ ఇష్యూస్ వంటి రివార్డులతో ప్రయోజనం పొందుతాడు. తమ పెట్టుబడిపై ఈ దీర్ఘకాలిక రివార్డుల ప్రభావాన్ని అర్థం చేసుకోవాలనుకునేవారికి, జీఎమ్ పాలీప్లాస్ట్ షేరు అందించిన లాభాలే నిదర్శనం.

జిఎమ్ పాలీప్లాస్ట్ బోనస్ షేర్లు

జీఎమ్ పాలీప్లాస్ట్ ఐపీఓ (G M Polyplast IPO) అక్టోబర్ 2020 లో మార్కెట్లోకి వచ్చింది. ఈ చిన్న, మధ్య తరహా పరిశ్రమ ఐపీఓను రూ.159 ఫిక్స్డ్ ధరతో ప్రారంభించారు. లాట్ సైజ్ 800 షేర్లు. ఈ ఇష్యూ స్టాక్ మార్కెట్లో చాలా ఫ్లాట్ గా లిస్ట్ అయింది. లిస్టింగ్ లాభాలు పొందాలనుకున్నవారు నిరాశ చెందారు. నష్టాలకే అమ్మేసుకున్నారు. కానీ, క్రమంగా ఈ ఎస్ఎంఈ స్టాక్ గణనీయంగా పుంజుకోవడం ప్రారంభించింది. ఆ తరువాత కంపెనీ ప్రమోటర్లు 6:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించారు. అంటే, ఒక్కో షేరుకు ఆరు బోనస్ షేర్లను కంపెనీ అర్హత కలిగిన వాటాదారులకు బోనస్ గా ఇచ్చారు. అంటే, ఐపీఓలో అలాట్ అయిన 800 జీఎమ్ పాలీప్లాస్ట్ షేర్లను అలాగే అట్టిపెట్టుకున్నవారికి 6:1 నిష్పత్తి ప్రకారం 4800 షేర్లు అదనంగా వచ్చాయి. అంటే వారి వద్ద ఉన్న మొత్తం షేర్ల సంఖ్య 5400[800 x {(6+1)/1}] కి చేరింది.

మూడేళ్లలో రూ.1.27 లక్షల నుంచి రూ. 11.40 లక్షలు

వన్ జీఎం పాలీప్లాస్ట్ ఐపీఓ లాగ్ లో 800 షేర్లు ఉండగా, పబ్లిక్ ఇష్యూను ఒక్కో షేరుకు రూ.159 చొప్పున ఆఫర్ చేశారు. ఈ మల్టీబ్యాగర్ బీఎస్ఈ ఎస్ఎంఈ ఐపీఓ (IPO) లో ఇన్వెస్ట్ చేయడానికి అవసరమైన కనీస మొత్తం రూ.1,27,200 (రూ.159 x 800). 6:1 బోనస్ షేర్ల తర్వాత, ఒక అలోటీ యొక్క నికర వాటా 5600 కు పెరిగింది. ఈ రోజు జీఎం పాలీప్లాస్ట్ షేరు ధర ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ. 211ను తాకింది. ఫ్లాట్ లిస్టింగ్ ఉన్నప్పటికీ ఈ ఎస్ఎంఈ ఐపీఓలో అలాట్ అయిన షేర్లను అలాగే అట్టిపెట్టుకున్న ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టిన రూ.1,27,200 లక్షలు, జూలై 9 నాటి ధర ప్రకారం రూ.11,39,600 అయ్యేవి.

సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి. హెచ్ టీ తెలుగు వి. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను తనిఖీ చేయాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.

WhatsApp channel